ఆస్ట్రేలియా టార్గెట్ 341

బ్యాటింగ్‌కు అనుకూల‌మైన రాజ్‌కోట్ పిచ్‌పై టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన‌ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 340 ర‌న్స్ చేసింది. భార‌త జ‌ట్టులో రోహిత్‌, ధావ‌న్‌, కోహ్లీ, రాహుల్‌లు రాణించారు. రోహిత్ శ‌ర్మ 42 ర‌న్స్‌, శిఖ‌ర్ ధావ‌న్ 96, కోహ్లీ 78 ర‌న్స్ చేశారు. ధావ‌న్ సెంచ‌రీ మిస్ కాగా, కోహ్లీ వ‌న్డేల్లో 56వ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఇక కేఎల్ రాహుల్‌.. ఆసీస్ బౌల‌ర్ల‌ను ధాటిగా ఎదుర్కొన్నాడు. త‌న ఖాతాలో మ‌రో హాఫ్ సెంచ‌రీ వేసుకున్న రాహుల్‌.. వ‌న్డేల్లో వెయ్యి ప‌రుగుల మైలురాయిని దాటేశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ శ‌ర‌వేగంగా హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. రాహుల్ వ్య‌క్తిగ‌తంగా 80 ర‌న్స్ చేసి ర‌నౌట్ అయ్యాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో జంపా మూడు, రిచ‌ర్డ్‌స‌న్ రెండు వికెట్లు తీసుకున్నారు.